ArticlesNews

హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ 2 వ భాగం

138views

హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ – 1 వ భాగం ఇక్కడ చదవండి

ఎవరీ చెన్నయ్య?
ఇంతకీ ఈ ముసుగు మనిషి లేదా చెన్నయ్య ఎవరు? ఇతడు కర్ణాటకలోని మాండ్యాకు చెందిన వాడు. నిజానికి తమిళుడు. ఆ రాష్ట్రంలోనే 1980లో పుట్టాడు. మాండ్యాలో 1987 నుంచి 1995 వరకు చదువుకున్నాడని రికార్డులు చెబుతున్నాయి. ధర్మస్థలకు సమీపంలోని ఉజిరేలో ఉన్న తన సోదరుడి ద్వారా ఇతడు దేవస్థానంలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. తరువాత తమిళనాడులో కూడా పారిశుద్ధ్య పనులు చేశాడు. కానీ ధర్మస్థలలోను, తమిళనాడులోను కూడా ఆరోపణల కారణంగా తొలగించారు. ఇతడెంత అబద్ధాలకోరో మాండ్యాలో అందరికీ తెలుసు. తెలియనది పోలీసులకే. ఇతడి గతం కూడా అంతో ఇంతో నేరపూరితమైనదే. ఇతడు చేసిన ఒక ఆరోపణను పట్టుకుని కొండను తవ్వారు. వందల శవాలు ఖననం చేశానన్నాడు చెన్నయ్య. తానే 70కి పైగా పాతిపెట్టా నన్నాడు. అన్నీ కలిపి పాతిక ముప్పయ్‌కి మించి కూడా ఎముకలు దొరకలేదు. అయితే ఇతడి తల్లిదండ్రులకి అతడి వర్గంలో మంచి పేరు ఉంది. గౌరవనీయులన్న ఖ్యాతి ఉంది. చెన్నయ్య మూడో తరగతి చదివాడు. ధర్మస్థల నుంచి 2014లో మళ్లీ స్వగ్రామం వెళ్లాడు, మూడో భార్యతో. అక్కడ ఉన్న ఒక సంవత్సరంలో ప్రభుత్వ స్థలంలో గ్రామ పంచాయతీ నిర్మించిన షెడ్‌ ‌తనదని స్థానికులతో గొడవకు దిగడంతో అక్కడ నుంచి వెళ్లిపోవలసి వచ్చింది. గ్రామస్థులు ఎవరు ధర్మస్థలకు వెళ్లినా వారిని గుడిలోపలి వరకు తీసుకుపోయేవాడు. ఒకసారి గ్రామంలో చీరలు పంచిపెట్టాడు. అవి వీరేంద్ర హెగ్గడ ఇచ్చారని చెప్పాడు. అలాగే మరొక దారుణం విషయం, శవాల మీద ఉండే చిన్న చిన్న ఆభరణాలు ఇతడు దొంగిలించేవాడని ఆ గ్రామస్థులు చెప్పారు. ఇతడు ధర్మస్థల గురించి అలాంటి ప్రకటన చేసి ఉండవలసింది కాదు. కానీ డబ్బు కోసం ఇతడు ఎంతకయినా దిగజారతాడని వారు చెప్పారు.

మొదటి భార్య ఆరోపణ
చెన్నయ్య మొదటి భార్య కూడా అతడు శుద్ధ అబద్ధాలకోరనే చెప్పింది. తాను 25 ఏళ్ల క్రితం అతడిని పెళ్లి చేసుకున్నానని, కుమార్తె, కొడుకు ఉన్నారని, తనను నిరంతరం తిట్టడం కొట్టడంతో విడాకులు తీసుకుని నాగమంగళలోని పుట్టింటికి చేరుకున్నానని మీడియాతో చెప్పారు. ఇతడికి ధర్మస్థలలో వీరేంద్ర హెగ్గడ ఒక ఇల్లు ఇచ్చి, రూ 3000 జీతం ఇచ్చేవారని చెప్పింది. నేత్రావతి నదిలో కొట్టుకు వచ్చిన అనాథ శవాలన• పూడ్చి పెడతానని చెప్పి రాత్రిళ్లు వెళ్లేవాడని, ఏం చేసేవాడో తెలియదని అన్నారు. ఇతడి అబద్ధాల మీద పూర్తిగా దర్యాప్తు జరిపించాలని కూడా ఆమె కోరారు. మొదటి భార్య విడాకులు తీసుకున్న తరువాత మరొక పెళ్లి చేసుకున్నాడు. ఆమె సత్యమంగళలోని బన్నారికి చెందినది. ఆమె ఏం చెప్పారంటే, తనతో పెళ్లి జరిగినా ఇతడు మరొక స్త్రీని తీసుకుని వెళ్లిపోయాడు. దీనితో తాను పరిహారం కోరానని, ఆ డబ్బు కోసం ఈ పని చేసి ఉంటాడని అన్నారు. చెన్నయ్య సహోద్యోగి, వైద్యనాథపురకు చెందిన రాజు కూడా చెన్నయ్య గతం గురించి ఇదే చెప్పాడు. అతడి జీవితమంతా అబద్ధాలతోనే నిండి ఉంది. ధర్మస్థలను అపఖ్యాతి పాల్జేయాలన్న ఉద్దేశం ఉన్న ఆ ముఠాతో ఇతడు కలవడానికి ముందు వరకు తమిళనాడులోనే ఉన్నాడు. ఆ వాస్తవాలు కూడా త్వరలోనే బయట పడతాయని అనుకోవచ్చు. తమిళనాడులోనే ఈ కుట్రకు పునాదులు పడ్డాయని ఇప్పటికైతే భావిస్తున్నారు.

సమీర్‌ ‌వీడియో
జూలై 10న చెన్నయ్య ఒక మానవ కపాలం పట్టుకుని ధర్మస్థలలోనే బెల్తంగాడీ కోర్టుకు వచ్చి సంచలనం సృష్టించిన ఒక రోజు తరువాత భయానక మైన వీడియో బయటకు వచ్చింది. ‘దూత’ యూట్యూబ్‌ ‌చానల్‌ ‌దీనిని లోకం మీదకు వదిలింది. 23 నిమిషాల 52 సెకెండ్లు ఉన్న ఆ వీడియో పేరు ‘హూ ఆర్‌ ‌సీరియల్‌ ‌కిల్లర్స్ ఆఫ్‌ ‌ధర్మస్థల’ (ధర్మస్థల వరస హత్యలు ఎవరు చేశారు?). ఆ చానెల్‌ను నడుపుతున్న వివాదాస్పద సమీర్‌ ‌మహమ్మద్‌ అనే యూ ట్యూబర్‌ ‌జూలై 12, 2025న దీనిని అప్‌లోడ్‌ ‌చేశాడు. దీనిని 31 లక్షల మంది చూశారట. ధర్మస్థల ఆలయం చుట్టూ ఉన్న అడవులలో వందలాది మృతదేహాలను పూడ్చి పెట్టారంటూ చెన్నయ్య చేసిన ఆరోపణల ఆధారంగా తయారు చేసిన వీడియో ఇది. కానీ చెన్నయ్య కథనానికి సమీర్‌ ‌సొంత పైత్యాన్ని కూడా రంగరించి వదిలి పెట్టాడు. చెన్నయ్య రెండు చెబితే సమీర్‌ ఇరవై రాశాడు. ఈ విషయం పోలీసులే చెప్పారు. వివాదాలు సృష్టించడం సమీర్‌ ‌మహమ్మద్‌కు కొత్తేమీ కాదు. 2008 నాటి ఒక విద్యార్థిని హత్యమీద ఇతడు పెట్టిన వీడియోకు సంబంధించి పది కోట్ల రూపాయల పరువు నష్టం కేసులో ఈ ఏప్రిల్‌లోనే కోర్టు సమన్స్ ‌పంపింది. అది కూడా ధర్మస్థలకు చెందినదే. శ్రీక్షేత్ర ధర్మస్థల ప్రతినిధి డి. హర్షేంద్రకుమార్‌, ‌నిశ్చల్‌ ‌డి ఈ కేసు వేశారు. సమీర్‌ ‌హిందూ ధార్మిక కేంద్రాలను అపఖ్యాతి పాలు చేయడమే పనిగా పెట్టుకున్నాడని ఆనాటి పిటిషన్‌లోనే వారు కోర్టుకు ఫిర్యాదు చేశారు. తరువాత అదే హిందూ పుణ్యక్షేత్రం మీద చెన్నయ్య ఆరోపణలు చేయడంతో కేసుకు కొత్త జీవం వచ్చింది. ఇంతకీ ఈ వీడియో ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌ద్వారా రూపొందించినది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు దక్షిణ కన్నడ పోలీసులు ఇతడికి వారెంట్‌ ‌జారీ చేశారు. ఇలాంటి కుళ్లిన సమా చారంతో మన తెలుగు అర్బన్‌నక్సల్స్ ‌కూడా వీడియోలో వదిలిపెట్టారు. అందులో ఒకదాని పేరు ‘తవ్విన కొద్దీ ఘోరాలు’. ఏవీ ఘోరాలు? ఏవీ శవాలు? రుజువులేవీ సామూహిక ఖననాలకి! అయినా ఇప్పటికీ ఈ బాపతు యూట్యూబర్లు అక్కడ శవాల గుట్టలు ఉన్నాయంటూ నమ్మించడానికే చూస్తున్నారు?

తౌసిఫ్‌ ఇం‌క్‌ ‌యూట్యూబ్‌ ‌కథనం
కనిపించకుండా పోయిన వారి ఆచూకీ తెలుసుకుని అందించడం, ఉత్కంఠలు ఛేదించడం మా ప్రత్యేకత అంటూ ఈ చానల్‌ ‌చెప్పుకున్నది. ధర్మస్థలలో కనిపించకుండా పోయారంటూ చాలా మంది పేర్లు ఇచ్చింది. తప్పిపోయిన వారి కథనాలు ఎక్కడెక్కడివో జరిగినవి ఇచ్చాం. ఇప్పుడు ధర్మస్థలలో జరిగినదేమిటో చెబుతాం అంటూ ఈ పేర్లు ఇచ్చింది. ధర్మస్థల పశ్చిమ కనుమలలో ఉంది. నేత్రావతి నదికి సమీపంగా ఉన్న ఈ ఆలయానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. అక్కడ వేలాది మందికి ఉచితంగా భోజనాలు పెడతారు. తమదైన ప్రత్యేక న్యాయవ్యవస్థతో వివాదాలు పరిష్కరిస్తారు. అది ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఆలయం. అయితే దీనికే మరొక చీకటి కోణం ఉందంటూ ఈ కథనం వండి వార్చింది. 1998 నుంచి 2013 వరకు ఇక్కడ 400 మంది కనిపించకుండా పోయారని ఈ చానల్‌ ‌చెప్పింది. మరొక 463 మంది అసహజంగా మరణిం చారని కూడా వెల్లడించింది. జూలై 22, 2025న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని కూడా ఇది చెప్పింది. ఆలయ పరిసరాలలోని అడవులు, నేత్రావతి నదిలో, అతిథి గృహాలలో గుర్తు తెలియని వారి శవాలు చాలా కనిపిస్తాయని, కానీ ఎలాంటి విచారణ లేకుండానే అవన్నీ ఆత్మహత్య లేనని రూఢి చేసేస్తారని కూడా తెలియచేసింది. స్థానికులు కూడా ఈ బలవన్మరణాల గురించి, ప్రధానంగా మహిళలు, బాలికల గురించి గుసుగుసలాడుకుంటూనే ఉంటారట. వీళ్ల మీద కూడా లేచివచ్చి ఆత్మహత్య చేసుకున్నవారిగా, ప్రమాదాలలో మరణించిన వారిగా ముద్ర వేస్తారని చెప్పుకుంటారని కూడా తేల్చేసింది. గడచిన 20 ఏళ్లుగా ఇలా బయట పడిన శవాల వివరాలు ఇవ్వవలసిందిగా ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌దక్షిణ కన్నడ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని నివేదిక కోరిందని కూడా ఈ చానల్‌ ‌తెలియచేసింది. దీనికి గురించి సామాజిక కార్యకర్తలు ఏం చెబుతారో అంటూ ఈ చానల్‌ ‌చేసిన వ్యాఖ్య మనకి చాలా సందేహాలు తెస్తుంది. ధర్మస్థల ఏకాంతంగా ఉంటుందని, ఇక్కడ ఆలయం కారణంగా ఆ బలవన్మరణాల గురించి వివరాలు తెలియకుండా ఉండిపోయే అవకాశం ఉందని అంటారట. కానీ నవేడ్డు నిల్లాదిద్దారే వంటి సంస్థలు వాటిపై దర్యాప్తు చేయించాలని గతంలో ఉద్యమాలు చేశాయట. జూలై 3న ముసుగు మనిషి ఇచ్చిన వాఙ్మూలం కారణంగా ఇక్కడకు వచ్చి కనిపించ కుండా పోయిన తమ కుటుంబికుల అస్థికలు ఇస్తే సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించు కుంటామంటూ అనేక మంది వచ్చారని కూడా తెలియచేసింది. 1979లో వేదవల్లి అనే ఆమె ఈ ఆలయం వద్ద కనిపించకుండా పోయిందంటూ జాబితా మొదలుపెట్టి 2018లో 15 ఏళ్ల వయసు విద్యార్థి శవం దొరకడం వరకు పలువురి పేర్లు ఈ వెబ్‌సైట్‌ ఇచ్చింది. ఇందులో సౌజన్య కేసు ప్రత్యేకమైనది (అనన్య కేసు కల్పితం, ఈ సంగతి ఆమె తల్లిగా చెప్పుకున్న సుజాతా భట్‌ అం‌గీక రించింది). సౌజన్య మృతదేహం అక్టోబర్‌ 9, 2012‌లో దొరికింది. ఆలయం నిర్వహించే ఒక ఆసుపత్రి వద్ద అడవికి సమీపంలో దొరికిన ఈ యువతి దేహం మీద లైంగిక అత్యాచారం జాడలు కనిపించాయని చెబుతారు. జస్టిస్‌ ‌ఫర్‌ ‌సౌజన్య పేరుతో మహేశ్‌ ‌శెట్టి తిమోరోడి ఉద్యమం మొదలు పెట్టాడు. ఇతడు బీజేపీ మీద ధ్వజమెత్తి, ఆ పార్టీ ప్రముఖుడు బీఎల్‌ ‌సంతోష్‌ ‌మీద అవాకులూ చెవాకులూ పేలినందుకు అరెస్టయ్యాడు. బెయిల్‌ ‌మీద వచ్చాడు.

సిట్‌ ‌జరుపుతున్న దర్యాప్తు గురించి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మంజునాథ్‌ ఎన్‌ అనే న్యాయవాదిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ పాతిపెట్టిన శవాలకు పరీక్షలు జరుపుతున్నా రంటూ ఈ న్యాయవాది జూలై 30న ఒక పత్రికా ప్రకటన విడుదల చేశాడు. దీనిమీదే ధర్మస్థలలోని బ్తెంగడి ప్రాంత వాసి రఘురామ్‌ ‌శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.