News

భక్తితోనే భగవంతుని అనుగ్రహం

122views

భగవంతుని అనుగ్రహం పొందడానికి భక్తి ఒక్కటే మార్గమని మేడసాని మోహన్‌ తెలిపారు. మహతి కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదిభట్ల నారాయణదాసు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హరి అంటే చేసిన పాపాలు పటాపంచలు అవతాయని తెలిపారు. భక్తుల్లో ప్రథమ స్థానంలో ప్రహ్లాదుడు ఉన్నాడని తెలిపారు.

భాగవతులు వై.వెంకటేశ్వర్లు, భాగవతారిణి వరలక్ష్మి మాట్లాడుతూ హరికతా గానం ద్వారా ధర్మ ప్రచారాన్ని వివరించారు. హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు జీవిత విశేషాలను తెలియజేశారు. భాగవతులు ఎంవీ.సింహాచల శాస్త్రి, పరాయితం నారాయణచార్య భాగవతులు ప్రసంగించారు.

హిందూ ధర్మప్రచార పరిషత్‌ కథకులు ఎం.రాముడు పార్వతి కల్యాణం, వెంకటేశ్వర్లు గజేంద్రమోక్షం గానం చేశారు. ఎస్వీ సంగీత కళాశాల ఆవరణలోని ఆదిభట్ల నారాయణదాసు విగ్రహానికి ప్రిన్సిపల్‌ ఉమా ముద్దుబాట, డీపీపీ కార్యదర్శి శ్రీరామ్‌ రఘునాథ్‌ పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆదిభట్ల చిత్రపటంతో ఊరేగింపుగా మహతి కళాక్షేత్రానికి చేరుకున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ డిప్యూటీ సెక్రటరీ రాంగోపాట్‌, ప్రాజెక్టు ఆఫీసర్‌ విజయలక్ష్మి, ఏఈవో సీహెచ్‌.సత్యనారాయణ పాల్గొన్నారు.