News

గాయత్రి మంత్రంతో ‍ప్రధాని మోదీకి స్వాగతం

180views

ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌లోని టోక్యోకు చేరుకున్న. ఆయన 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. టోక్యోలో ప్రధాని మోదీని గాయత్రి మంత్ర జపంతో స్వాగతించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిలో జపాన్ కళాకారులతో పాటు ప్రధాని మోదీ కూడా గాయత్రి మంత్రాన్ని పఠించడం కనిపిస్తుంది.

జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్ పర్యటన చేపట్టారు. ప్రధాని మోదీ 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. పలువురు వ్యాపారవేత్తలతో సంభాషించారు. ‘టోక్యోలో అడుగుపెట్టాను. భారత్‌- జపాన్ తమ అభివృద్ధి సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ పర్యటనలో ప్రధాని ఇషిబా, ఇతర అధికారులతో సంభాషించాలనుకుంటున్నాను. ఇది సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు.