News

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు

167views

హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆగస్టు 15, 16, 17 తేదీల్లో విశాఖపట్నం జిల్లా గంభీరం గ్రామంలో వైభవంగా నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధి యదురాజ దాస్‌ మీడియా సమావేశంలో తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను విశాఖ నగరంలో గాదిరాజు ప్యాలస్ లో హరే కృష్ణ వైకుంఠంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 16న మహా మంగళ హారతి, బాల గోపాలునికి ఊయ్యాల సేవ, ప్రత్యేక అలంకరణ, ఉట్టి మహోత్సవం, కృష్ణుడి పై ప్రశ్నల పోటీలు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా జరిపేందుకు సర్వం సిద్దం చేసినట్లు హ తెలిపారు. ప్రతి ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభోగంగా వేలాది మంది భక్తుల నడుమ జరుపు కోవడం జరుగుతుందని చెప్పారు.

అదే విధంగా ఈ ఏడాది కూడా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, ధర్మ సూత్రములను తిరిగి స్థాపించటానికి తాను ఈ లోకంలో ప్రతి యుగంలో అవతరిస్తాను అని భగవద్గీత లో శ్రీ కృష్ణుడు చెప్పడం జరిగిందని పేర్కొన్నారు.