
శ్రీశైలంలోని వడ్డెర ప్రైవేట్ సత్రంలో అన్యమత ప్రార్థన చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సత్రం చైర్మన్ జరుపటి రాములు బామ్మర్ది రమణతో కలిసి ఓ పాప పుట్టిన రోజు వేడకుల సందర్భంగా అన్యమత ప్రార్థనలు చేసి పాపను దీవిస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో స్థానికంగా వైరల్ అయింది. ఈ విషయంపై విరాట్ హిందుస్థాన్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ మండిపడ్డారు. పుణ్యక్షేత్రంలో ఉంటూ అన్నదాన సత్రంలో సభ్యుడిగా ఉండి మరీ ఇవేం పనులని వారు నిలదీశారు.
ఈ విషయాన్ని దేవస్థానం అధికారుల దఈష్టికి తీసుకళ్లారు. దీనిపై స్పందించిన దేవస్థానం సీఎస్ఓ స్థానిక పోలిస్ స్టేషన్ లో ఆ వ్యక్తిపైన ఫిర్యాదు చేశారు. అన్యమత ప్రార్థనలు చేసిన కర్నూలుకు చెందిన రమణ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు, ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్లు శ్రీశైలం సీఐ ప్రసాద్ రావు తెలిపారు. శ్రీశైలంలో అన్యమత ప్రచారం చేయద్దనే నియమం ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఇలాంటి పనులు చేయడం పట్ల హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బాధితలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.




