News

బంగ్లాదేశ్ లో హిందూ మహిళపై అత్యాచారం

232views

బంగ్లాదేశ్ లోని మురాద్నగర్ లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్పా ర్టీ(బీఎన్పీ) నేత ఒకరు హిందూ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడు సహా ఐదుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రాపూర్ పచ్కిట గ్రామానికి చెందిన ఫజోర్ అలీ(38) జూన్ 26వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఓ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి బాధితురాలి(21)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడికి దేహశుద్ధి చేశారు. పారిపోయిన అతడిని ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఢాకాలోని సైదాబాద్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తతోపాటు దుబాయ్ లో ఉంటున్న బాధితురాలు హరిసేవా పండుగ కోసం పిల్లలతో కలిసి తండ్రి వద్దకు వచ్చిందని తెలిపారు. షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగినప్పటి నుంచి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.