News

చాగల్లు రిజర్వాయర్‌లో అమ్మవారి విగ్రహం లభ్యం

223views

శ్రీసత్యసాయి జిల్లా పెద్దపప్పూరు చాగల్లు రిజర్వాయర్‌లో అమ్మవారి పంచలోహ విగ్రహం లభ్యమైంది. పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన కొందరు జాలర్లు రాత్రి చేపల వేట కోసం చాగల్లు రిజర్వాయర్‌ దిగువ ప్రాంతంలో వలలు వేయగా 3 అడుగుల ఎత్తు దాదాపు 30 కిలోల బరువు ఉన్న పంచలోహపు అమ్మవారి విగ్రహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పెద్దపప్పూరు గ్రామస్తులు అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలతో ఘనంగా ఊరేగించి చౌడేశ్వరిదేవి ఆలయంలో ఉంచారు.