News

పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ లండన్‌లో భారతీయుల నిరసన

253views

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ లండన్‌లో భారతీయులు నిరసన చేపట్టారు. పాకిస్థాన్‌ హై కమిషన్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

భారతీయ జెండాలు, బ్యానర్లు మరియు ప్లకార్డులతో నిరసనలు వ్యక్తం చేశారు. ప్రాణనష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాడులకు కారణమైన ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చి ఆశ్రయం కల్పిస్తోందని విమర్శించారు. ఈ ప్రదర్శన శాంతియుతంగా నిర్వహించినప్పటికి పోలీసులు అరెస్టు చేశారు.