
కేరళ సెంట్రల్ యూనివర్శిటీలో జరిగే ఆర్ట్స్ ఫెస్టివల్ లో వివాదం రేగింది. వామపక్ష విద్యార్థి సంఘం నేతలు (SFI) దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని అడ్డుకుంది. దీంతో వివాదం రేగింది. వేదిక ముందే దీప ప్రజ్వలన ఏర్పాటు చేసినప్పటికీ… ఈ దీప ప్రజ్వలన కార్యక్రమమే జరగలేదు. నేరుగా కార్యక్రమం ప్రారంభమైపోయింది. భారతీయ సంప్రదాయం ప్రకారం దీప ప్రజ్వలన అన్న సంప్రదాయానికి పెద్దపీట వుంటుంది. ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా.. మొదట దీప ప్రజ్వలన చేస్తాం.
షెడ్యూల్ ప్రకారం యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ సిద్దు అల్గుర్ దీప ప్రజ్వలన చేయాల్సి వుంది. కానీ… ఆయన చేయలేదు. సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం SFI ఒత్తిళ్లకు తలొగ్గే… వీసీ దీప ప్రజ్వలన అన్న సంప్రదాయాన్ని ఎగ్గొట్టి, నేరుగా కార్యక్రమాన్ని ప్రారంభించారన్న విమర్శలు వస్తున్నాయి.
అయితే.. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఘాటుగా స్పందించింది. దీప ప్రజ్వలన చేసే, కార్యక్రమాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేసింది. అయినా.. వీసీ సిద్దు అల్గుర్ మాత్రం ఏబీవీపీ డిమాండ్ ను పక్కనపెట్టి, నేరుగా కార్యక్రమాన్నే ప్రారంభించేశారు. కనీసం ఇలా ఎందుకు అన్న వివరణ కూడా లేదన్న విమర్శలు వస్తున్నాయి.
అయితే.. కొన్ని రోజుల క్రితం కూడా విద్యార్థుల డ్రెస్ కోడ్ విషయంలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఒత్తిళ్లు తెచ్చాయన్న విమర్శలున్నాయి. ఆరు నెలల క్రితం ఐటీ/ఈపీ స్వాగత కార్యక్రమం సందర్భంగా కొత్తగా చేరిన విద్యార్థులను అరబ్ దుస్తులలో కనిపించమని బలవంతం చేశారు.
మరోవైపు గత సంవత్సరం కూడా ఆర్ట్ ఫెస్టివల్ జరిగింది. ఇదే వామపక్ష భావజాలం గల విద్యార్థి సంఘాలు భారతమాతను అవమానించే కటౌట్లను ప్రదర్శించారు. దీనిపై జాతీయవాదులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో సైద్ధాంతిక ఘర్షణలు కూడా జరిగాయి.





