
327views
ఆవులతో అసహజ శృంగారంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇండోర్లో ఒకరిని, అదే విధంగా మందసౌర్ జిల్లాలో మరొకరికి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం… మొదటి ఘటన ఇండోర్ జిల్లాలో జరిగినట్లు చెప్పారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగు చూడటంతో హిందూ సంఘాల ఆందోళనకు దిగాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సమీపంలోని భవనంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విషయం నిర్థారణ చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. మరో ఘటనలో ఇండోర్ కు 200కి.మీ.ల దూరంలోని మండసౌరి జిల్లా అఫ్టల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగ్గా, ఆ ఘటనలో నిందితుడుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ టు యానిమల్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.





