
ప్రపంచంలో ఎక్కడైనా సాధారణంగా ఒక వ్యక్తి విజయానికి గీటురాళ్లుగా వారి విద్యార్హతలు, ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం, ఇతర ప్రాపంచిక విజయాలను తీసుకుంటారు. ఇవన్నీ ఉన్నా కూడా ప్రద్యుమ్న భగత్ ప్రయాణం ఆధ్యాత్మికత వైపు సాగడం ఒక ప్రత్యేక ఉదాహరణ. బాప్స్ (బోచన న్వాసి అక్షర పురుషోత్తమ స్వామినారాయణ్ సంస్థ)లో సేవలు అందిస్తున్నారు. ఆయనది ఒక అద్భుత యాత్ర, ప్రద్యుమ్న న్యూజిలాండ్లోని అక్లండ్లో పుట్టారు. పదిహేనో ఏటనే గొప్ప వక్తగా పేర్గాంచారు. బోయింగ్, నాసా సంస్థలలో అవకాశం వచ్చింది. అయితే అవేమీ ఆయనను ఆకర్షించలేదు. అంతరిక్ష పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాల నుంచి ఆయన ఆధ్యాత్మిక చింతనవైపు చూశారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక బాప్స్ చేరారు. దీక్ష తీసుకుని సాధు కేశవసంకల్పదాస్ గా మారారు. జీవితంలో విజయం సాధించడం అంటే ఏమిటో ఆయన కొత్త రీతిలో ఆవిష్కరించారు. తన మనను చెప్పినట్టు నడుచుకోగలడమే అసలైన విజయం.





