News

ఏబీవీపీ నగర క్రీడోత్సవ్‌–2025 పోస్టర్‌ ఆవిష్కరణ

242views

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు జరగనున్న నగర క్రీడోత్సవ్‌-2025 పోస్టర్‌ను శాప్‌ చైర్మన్‌ రవినాయుడు ఆవిష్కరించారు. మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఖేలో భారత్‌ నగర క్రీడోత్సవ్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపీ చౌదరి, స్టేట్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు దుర్గారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాప్‌ నుంచి పూర్తిసహకారం అందిస్తామని, పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర కీర్తి ప్రతిష్టతలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేయాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడా ప్రోత్సాహకాల బకా యిల విడుదలకు కృషి చేసినందుకు కృత జ్ఞతలు తెలియజేస్తూ శాప్‌ చైర్మన్‌ను ఏపీ సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ తరఫున సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాప్‌ నుంచి పూర్తిసహకారం అందిస్తామని, పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర కీర్తి ప్రతిష్టతలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేయాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడా ప్రోత్సాహకాల బకా యిల విడుదలకు కృషి చేసినందుకు కృత జ్ఞతలు తెలియజేస్తూ శాప్‌ చైర్మన్‌ను ఏపీ సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ తరఫున సత్కరించారు.