
359views
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ భాషా సమ్మేళనం అంశంపై జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక మహాసంఘ్, కేంద్ర విద్యాశాఖ పరిధిలోని భారతీయ బాషా సమితి సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి విద్యారంగ నిపుణులు పాల్గొన్నారు. ముందుగా అతిథులచే సరస్వతి దేవి చిత్రపటం వద్ద జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి జి.ఎస్.ఆర్.క్రిష్ణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి జి.ఎస్.ఆర్.క్రిష్ణమూర్తి భారతీయ బాషా సమ్మేళనంను వివరించారు.





