
ప్రజల్లో ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్యాన్ని కలిగించడం కోసం సభలు మహాసభలు ఏర్పాటు చేస్తున్నట్టు అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు మాతా పరావిద్యానందగిరి స్వామిని అన్నారు. ఏటా వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.కాకినాడ జిల్లా దేవరపల్లిలోని కరుటూరి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న అఖిలాంధ్ర సాధు పరిషత్ రం నిర్వహించిన సభలో మాతా విద్యానందగిరి స్వామిని ప్రసంగించారు. మహాసభలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. దేవరపల్లి, నల్లజర్ల, చాగ ల్లు, కొవ్వూరు, గోపాలపురం, తాళ్లపూడి మండలా ల్లోని పరిసర గ్రామాలకు చెందిన భక్తులు భారీగా తర లి వచ్చి స్వాముల ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధాలను భక్తి శ్రద్ధలతో ఆలకించారు. ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సభలు నిర్వహించారు. పరిషత్ అధ్యక్షులు మాతా పరవిద్యానందగిరి స్వామిని ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహిస్తున్నారు. హిందూమతం ప్రాధాన్యం గురించి స్వామిజీలు వివరిస్తున్నారు. మానవులంతా సన్మార్గంలో నడవాలని సూచించారు. సత్యానందాశ్రమ పీఠాధిపతులు హరితీనకథ్ధ స్వాముల అధ్యక్షతన జరిగిన సభలో పీఠాధిపతులు, ఆశ్రమాల స్వామీజీలు ప్రసంగించారు.





