News

జాబిల్లిపై ఆవలివైపూ అగ్నిపర్వత విస్ఫోటాలు

323views

చంద్రుడిలో మనం చూడగలిగేవైపు మాదిరిగానే ఆవలివైపునా కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత విస్ఫోటాలు జరిగాయని తాజా పరిశోధన ఒకటి తేల్చింది. జాబిల్లిపై ఇప్పటివరకు పెద్దగా వెలుగులోకి రాని ప్రాంతం నుంచి చైనాకు చెందిన చాంగే-6 వ్యోమనౌక మొదటిసారి మట్టి, రాళ్లు తీసుకురాగా పరిశోధకులు వాటిని విశ్లేషించారు. 280 కోట్ల సంవత్సరాలనాటి అగ్నిపర్వత శిలల శకలాలతోపాటు 420 కోట్ల ఏళ్ల కిందటి అగ్నిపర్వత శిలల శకలాలూ వాటిలో ఉన్నట్లు గుర్తించారు.