
362views
మండల-మకరవిళక్కు సీజనులో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తున్నారు. తొలిరోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమా చారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్లో దర్శన సమయాలను పొడిగించినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వచ్చే ఏడాది మండల-మకరవిళక్కు సీజన్లోగా రోప్ వే సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వి.ఎన్.వాసవన్ తెలిపారు. రోప్ వే నిర్మాణ కాంట్రాక్టును ఇప్పటికే ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించామని ఆయన తెలిపారు.




