News

సరాయ్ కాలే ఖాన్ కూడలి పేరు ‘భగవాన్ బిర్సా ముండా చౌక్ గా మార్పు

571views

ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ కూడలి పేరును ‘భగవాన్ బిర్సా ముండా చౌక్ గా మారుస్తున్నట్లు కేంద్ర గృహని ర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.
దిగ్గజ గిరిజన నాయకుడు బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని రింగు రోడ్డులో గల బాంసెరా పార్కు ప్రవేశద్వారం వద్ద ఆయన విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఆవిష్కరించారు. ఝార్ఖండ్ గడ్డపై భగ వాన్ బిర్సాముండా పుట్టిన ఈరోజును భారత్లో ‘ఆది వాసీ గౌరవ్ దిన్’గా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021లోనే ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. “బిర్సాముండా 150వ జయం తిని ఈరోజు నుంచి వచ్చే ఏడాది నవం బరు 15 దాకా దేశమంతా ఆదివాసీ గౌరవ్ వర్ష్ గా జరుపుకోవాలి. ఆయన జీవితంలోని రెండు పార్శ్వాలను గమనిస్తే.. ఒకవైపు గిరిజన సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తూనే, మరో వైపు దేశ స్వాతంత్ర్యం కోసం అపురూపమైన త్యాగం చేశారు” అన్నారు. అమిత్ షా ఆవిష్కరించిన 3,000 కిలోల బిర్సాముండా విగ్రహాన్ని పశ్చిమబెంగాలు చెందిన ఇద్దరు శిల్పులు రూపొందించారు.