News

రష్యా దేశస్తుల హరేకృష్ణ నగర సంకీర్తన

307views

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో రష్యా దేశస్తులు చేపట్టిన హరేకృష్ణ నగర సంకీర్తన కమనీయంగా సాగింది. స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవరణ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు అక్కడి నుంచి అమ్మవారిశాల వరకు సుమారు 4 గంటల పాటు ఈ సంకీర్తన కొనసాగింది. విదేశీ భక్తులకు స్థానికులు పూలమాలలు, మంగళ హారతులు పట్టారు. వారి కృష్ణ నామస్మరణను విని పులకించారు. అంతకు ముందు ఇస్కాన్ సభ్యులు, భక్తులు కృష్ణ, బలరాముల ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ నగీన ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.