ArticlesNews

ప్రకృతి రక్షణ – సామాజిక సమరసత

323views

ఏ అవసరానికో ఒక్క చెట్టు కొట్టాలంటే పది చెట్లను నాటాలని, ఏ పండుగో, వ్రతమో, పూజనో చేసుకోవాలనుకున్నా అది వ్యక్తిగతమైనదైనా పదిమందిని పిలిచి భోజనాలు పెట్టి వారి ఆకలి తీర్చి వాయనాలు ఇవ్వమని చెప్పిన విషయం, పదిమంది చదువు కోసం పదుగురి దాహం తీర్చడం కోసం ప్రతి గృహస్తు ఆలోచించాలి. వివాహము నుండి చావు పుట్టుకల వరకు ప్రతి సందర్భంలోనూ సమాజంలోని ప్రతి కులము యొక్క సహకారంతోనే నిర్వహించుకుంటాము.

ఉదాహరణకు వివాహంలో గంధము, యజ్ఞోపవీతం, కొత్త బట్టలు పద్మశాలీల నుండి, పెళ్లి కుండలు కుమ్మరి నుండి, పెళ్లికి కొత్తచెప్పులు, ఇంటి ముందు పందిళ్లు మంగళ వాయిద్యాలు ఇక వివాహంలో చాకలి మంగలి ఇలా అన్ని కులాల వారిని ఆహ్వానించి వారు చేసే సేవలకు ప్రతిఫలంగా మనం వారికి డబ్బులు ఇవ్వము వారిని గౌరవించేందుకు కొత్త బట్టలు పెట్టి సన్మానించి కట్నం పెడతాము.

ఇలా మన పూర్వీకులు ఏర్పాటుచేసిన సామాజిక సమరసతా విధానాన్ని 100కు 100% అనుసరించాలి. సంపాదించిన ధనం తనకు తన కుటుంబానికి మాత్రమే కాదు తన గ్రామానికి మన దేశానికి చివరికి ప్రకృతి మొత్తానికి ఉపయోగపడే విధంగా అనేక నిర్మాణాలు, దానాలు, యజ్ఞాలు చేయాలని చెప్పిన స్వదేశీయ సాహిత్యంలోని వేదాలు, పురాణాలు, ఇతిహాసాల కథనం.

ఇవి చెప్పిన బాధ్యతలను మరిచి హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీల నుండి సాధారణ వ్యక్తి వరకు తన కోసం మాత్రమే ఆలోచిస్తూ సమాజం కోసం ఏమి ఇవ్వకుండా పైపెచ్చు సమాజం యొక్క సామూహిక సంపద నుండి దోచుకోవడం, అది తమ గొప్పతనంగా చెప్పుకోనే పరిస్థితి నెలకొనడం బాధాకరం దీనిని సరిచేసి వ్యక్తి నియమాలను పాటించేటట్లుగా చూసుకోవడం కూడా అత్యవసరం.

“స్వదేశీ నినాదం కాదు – నిబద్ధతతో కూడిన జీవన విధానం” : పరతంత్రం లో జీవించడం కన్నా పాపం మరొకటి లేదు. ఏ దేశం నుండైనా ప్రజలకు మేలు చేసే ఏ కొత్త విషయం వచ్చినప్పటికీ దానిని మన దేశ అవసరాలకు, ఆలోచనలకు అనుగుణంగా మార్చుకుని ఉపయోగించుకోవాలి. అందుకే స్వదేశభక్తి తో ‘స్వ’త్వం కలిగిన వ్యక్తులు స్వభాష స్వవేషం, స్వభూష, స్వధర్మనిష్టలను పాటించినవారు తాము ఆనందంగా జీవించగలుగుతారు, పదుగురికి ఆనందాన్ని పంచుతారు, ప్రకృతిని రక్షించుతారు.