News

మన దేశం నుంచే తొలిసారి కైలాస శిఖర దర్శనం

13views

పరమ శివుడి నివాసంగా భక్తులు భావించే కైలాస శిఖరం తొలిసారిగా మన దేశ భూభాగం నుంచే యాత్రికులకు దర్శ నమిచ్చింది. ఉత్తరాఖండ్ లోని పితోర్ గఢ్ జిల్లాలో వ్యాస లోయ వద్ద గల పాత లిపులేఖ్ పాస్ నుంచి ఈ పవిత్ర దర్శనం ఆవిష్కృతమైంది. గతంలో కైలాస శిఖరాన్ని సందర్శించేందుకు యాత్రికులు టిబెట్ భూభాగంలోకి వెళ్లాల్సి వచ్చేది. “అయిదుగురితో కూడిన యాత్రికుల మొదటి బృందం సభ్యులు పాత లిపులేఖ్ పాస్ నుంచి కైలాస శిఖరాన్ని దర్శించారు. ఈ అపు రూప ఘట్టం యాత్రికులకు అలౌకికానందాన్ని అందించింది” అని పితోర్ఢ్ జిల్లా పర్యాటక అధికారి కృతి చంద్ర ఆర్య పేర్కొన్నారు. వీరంతా బుధవారం గుంజి శిబిరానికి చేరుకుని అక్కడ నుంచి 2.5 కి.మీ. పాత లిపులేఖ్ పాస్ కు పర్వ తారోహణ చేసి కైలాస శిఖరాన్ని సందర్శించారు.