News

లవ్‌ జిహాద్‌తో దేశ ఐక్యతకు ముప్పు

11views

లవ్‌ జీహాద్‌ మన దేశానికి పెను ముప్పు అని ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు హెచ్చరించింది. ఓ కమ్యూనిటీకి చెందిన సంఘ వ్యతిరేక శక్తులు భారతదేశంపై ఆధిపత్యాన్ని సాధించేందుకు దీనిని ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ కుట్ర, మైనారిటీల జనాభాను విపరీతంగా పెంచుకోవడం ద్వారా తమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారని చెప్పింది.

ఓ కేసు విచారణ సందర్భంగా అదనపు జిల్లా జడ్జి (ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు) రవికుమార్‌ దివాకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టవ్యతిరేకంగా మతమార్పిడులకు పాల్పడటం కోసం హిందూ యువతులను ప్రేమ పేరుతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పారు. పాక్‌, బంగ్లాదేశ్‌లలో ఉన్న పరిస్థితులను భారత్‌లో కూడా సృష్టించాలనుకుంటున్నారని తెలిపారు. ఈ కేసులో దోషి మహమ్మద్‌ అలీంకు జీవిత ఖైదు, అతని తండ్రికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు.