News

ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి

31views

ఆలయాల జీర్ణోర్ధరణకు అన్ని విధాల కృషి చేస్తామని వైయస్సార్, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల దేవదాయ శాఖ అధికారి సి.విశ్వనాథ్‌ అన్నారు.అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని హసనాపురం గ్రామంలో వెలసిన పలు దేవాలయాలను ఆయన సందర్శించారు. దేవాలయాలపై పిచ్చిమొక్కలు మొలవడంపై ఆలయ కమిటీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హసనాపురం గ్రామంలోని ఎరుగులమ్మ దేవాలయం, కోదండరామస్వామి ఆలయం, మూలస్ధానేశ్వర స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం తదితర ఆలయాలను పరిశీలించారు. ఆలయాలు ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, దేవాలయాలకు కేటాయించిన భూములు అన్యాక్రాంతం కావడంతో పాటు ఆలయాలకు సంబంధించిన నిధులు పూర్తిగా నాయకులు తినేశారని, ఎరుగులమ్మ ఆలయానికి సంబంధించిన నిధులు గతంలో ఆలయ ధర్మకర్తగా ఆలయాన్ని పూర్తిగా కట్టించినట్లుగా బిల్లులు మార్చుకున్నారన్నారు.

హసనాపురం కస్పాలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కట్టకుండా అసంపూర్తిగా నిలిపేశారని, దీంతో ఆలయంలో పిచ్చి మొక్కలు మొలిచాయి. పప్పిరెడ్డిగారిపల్లెలోని దేవాలయం పరిస్థితి అలాగే ఉందన్నారు. ఆలయాల జీర్ణోర్ధరణకు అన్ని విధాలు కృషి చేస్తామని, ధూప దీప నైవేద్యాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం అన్ని ఆయాలలో జీర్ణోర్ధరణకు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఆలయాలకు సంబంధించిన భూములు ఎక్కడున్నా, ఎవ్వరి వద్ద ఉన్నను బయటికి తీస్తామని, ఆ భూముల్లో వచ్చే ఆదాయం ఆలయాలకు ఉపయోపడే విధంగా చర్యలు చేపడతామన్నారు. దేవుడికి వచ్చే డబ్బుల విషయంలో ఎవరు అవకతవకలకు పాల్పడవద్దని, ఆలయాల పేరుతో వచ్చే ప్రతి రూపాయి ఆలయాలకు ఖర్చు పెట్టాలన్నారు. కార్యక్రమంలో రాయచోటి వీరభద్ర స్వామి దేవాలయం ఈఓ రమణారెడ్డి, సిబ్బంది, మండల పోలీసులు పాల్గొన్నారు.