News

అంబులెన్స్‌కు దారిచ్చి మానవత్వాన్ని చాటుకున్న భక్తులు

917views

మేళ తాళాలతో, విచిత్ర వేషాలతో ‘గణపతి బప్పా మోరియా’ అనే నినాదాలతో లక్షలాది భక్తుల మధ్య  కోలాహలంగా జరుగుతున్నగణేష్ నిమజ్జనోత్సవంలో లక్షలాదిమంది భక్తులు స్వచ్ఛందంగా పక్కకు తప్పుకొని ఓ అంబులెన్స్‌కు దారిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పుణెలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గణేశ్‌ భక్తుల చర్యను ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

మహారాష్ట్రలోని పుణెలో గురువారం గణేశ్‌ నిమజ్జనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక లక్ష్మీ రోడ్డులో జరిగిన నిమజ్జనం కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అదే సమయంలో అటుగా ఓ అంబులెన్స్‌ వచ్చింది. గమనించిన భక్తులు వెంటనే అప్రమత్తమై స్వచ్ఛందంగా అంబులెన్స్‌కు దారిచ్చారు. దీంతో ఎటువంటి ఇబ్బందీ లేకుండా అంబులెన్స్‌ జనాలను దాటుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అంతటి ఉత్సవంలో కూడా భక్తులు అంబులెన్స్‌కు దారిచ్చి  ఓ నిండు ప్రాణాన్ని కాపాడి తమ మానవత్వాన్ని చాటారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.