News

మణిపూర్ లోని శివాలయానికి నిప్పు.. వారంలోనే రెండోసారి

34views

మణిపూర్ లోని సేనాపి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చొరబడి మరీ శివాలయానికి నిప్పంటించారు. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. రెండు వారాల వ్యవధిలోనే ఆలయంపై రెండోసారి దాడి జరిగిందని స్థానికులు ప్రకటించారు. ఆలయం మంటల్లో చిక్కుకోవడం అంా కూడా సీసీ టీవీలో రికార్డైంది. మరోవైపు మొదటిసారి ఆలయంపై దాడి జరిగిన సమయంలో దుండగులు ముసుగులు ధరించి, ధ్వజస్తంభం వెనుక దాక్కున్నట్ుల సీసీ టీవీలో రికార్డైంది. అయితే.. అప్పుడే అలర్ట్ అయిన స్థానికులు మంటలు వ్యాపించక ముందే ఆర్పేశారు.

కానీ… తాజాగా జరిగిన ప్రమాదంలో ఆలయం కాస్త దెబ్బతింది. పశుపతినాథ్ ఆలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ నాగా పీపుల్స్ ఆర్గనైజేషన్ మరియు కరోంగ్ సేనాపతి టౌన్ కమిటీ ఓ ప్రకటనను విడుదల చేశాయి. సేనాపి ప్రాంతంలో అన్ని వర్గాలు సామరస్యంగా వుంటారని, కానీ.. సామాజికంగా అశాంతి రేపడానికి కొన్ని వర్గాలు పనిగట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మత, జాతిపరమైన ఉద్రిక్తతలను బాగా రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో ఈ ఘటన చేశారని ఆరోపిస్తున్నారు. ఇక… పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.