News

దేశంలో సనాతన హిందూ బోర్డ్ ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ బాబా

50views

బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని సూచించారు. దేశంలో వక్ఫ్ బోర్డు అనేది ఒకటి వుందని, అలాగే దేశంలోని హిందువులకు ఓ బోర్డు ఎందుకు వుండొద్దని సూటిగా ప్రశ్నించారు. దేశంలో వెంటనే సనాతన హిందూ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. హిందూ సమాజం సంస్థాగతంగా బలంగా నిర్మాణం కావాలని, హిందూ సమాజానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.

ఈ కుట్రలను, మోసాలను అరికట్టడానికే ఇలా చేయాలన్నారు. హిందూమతం సమాజాన్ని, ప్రజలను, హిందూ సాంస్కృతిని, హిందువుల హక్కులను రక్షించడానికి వక్ఫ్ తరహాలోనే హిందూ బోర్డు రావాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. హిందూ సమాజం ఇప్పుడు బలహీన స్థితిలో వుందని, అందుకే సమాజ భద్రత, స్వేచ్ఛ కోసం సంఘటితం కావాలన్నారు. ఇీవలే మధ్యప్రదేశ్ సీఎం జైన్ బోర్డు విషయంలో తనతో చర్చించారని, ఇలాంటి పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు మాదిరిగానే.. హిందూ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయకూడదో చెప్పాలని నిలదీశారు.