News

అవన్నీ మా ఆస్తులే.. వక్ఫ్ మాటలకు ముక్కున వేలేసుకుంటున్న జనాలు

21views

ఢిల్లీ వక్ఫ్ బోర్డు పలు ఆస్తులు తమవేనంటూ కొత్త రాగం అందుకుంది. దీంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది. డీటీసీ బస్టాండ్, డీడీఏ కార్యాలయం, ఫోర్ లైన్ రహదారితో పాటు ఎంసీడీ డస్ట్ బిన్ వక్ఫ్ ఆస్తులంటూ పేర్కొంది. అంతేకాకుండా హిందూ దేవాలయాలను ఖాళీ చేసి, ఆ ఆస్తులను వక్ఫ్ బోర్డుకి తిరిగి ఇచ్చేయాలంటూ వితండవాదనకు దిగింది. ఈ ఆస్తులన్నీ వక్ఫ్ బోర్డువేనని, వీటిపై హిందూ సంస్థలకు ఎలాంటి హక్కులూ లేవని తెలిపింది.

ఇలా చాలా రోజులుగా వాదిస్తూ వస్తోంది. మతపరమైన సంస్థలు, పబ్లిక్ మరియు ప్రభుత్వ ఆస్తులు తమవేనంటూ వక్ఫ్ వాదనకు దిగింది. ప్రజలు వినియోగిస్తున్నవి, దేవాలయాలు… ఇలాంటివన్నీ తమ బోర్డుకే చెందుతుందని, అన్యాయంగా తీసుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని కొన్ని ప్రధాన ఆలయాలు, బహిరంగ ప్రదేశాలను కూడా వక్ఫ్ పేర్కొంటోంది.

వక్ఫ్ బోర్డు, ప్రతినిధులు ప్రతిసారీ ఇలాంటి తప్పుడు వాదనలు, వితండ వాదనలు, నిరాధార మాటలను చూసే… వక్ఫ్ చట్టంలో మార్పులు తేవాలన్న డిమాండ్లు బాగా వస్తున్నాయి. అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. వక్ఫ్ చట్టాన్ని సంస్కరించాల్సిన అవసరం వుందని, దీంతో ఇలాంటి వాదనలు మళ్లీ పైకి రావని అంటున్నారు. వక్ఫ్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, హిందూ సమాజం నుంచి ఆస్తులు లాక్కొనే ప్రయత్నాలు చేస్తున్నారని హిందూ సంస్థలు పేర్కొంటున్నాయి.