News

ఆర్టికల్‌ 370ని ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు: ఫరూక్‌ అబ్దుల్లాపై అమిత్‌ షా విమర్శలు

16views

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్‌ పూర్తయింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా, కాంగ్రెస్, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ సహా ఇతర పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాఔరీ జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

‘‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ అధికరణం 370 రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ, అధికారం వచ్చాక ఆ ఆర్టికల్‌ను పునరుద్ధరిస్తామని ఫరూక్‌ అబ్దుల్లా చెబుతున్నారు. ఏ శక్తీ దాన్ని తిరిగి తీసుకురాలేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో బంకర్ల అవసరం లేదు. ఎందుకంటే.. కాల్పులు జరిపే సాహసం ఎవరూ చేయలేరు. జమ్మూకశ్మీర్‌లో కేవలం మన దేశ త్రివర్ణ పతకం మాత్రమే రెపరెపలాడుతుంది’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.