News

‘లడ్డూ ప్రసాదం’ వివాదంపై సీఎంకు టీటీడీ నివేదిక

29views

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీపై టీటీడీ, రాష్ట్రప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యిలో అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేగింది. గత ప్రభుత్వ హయాంలోనే లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గిపోయిందని అందుకు వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలే కారణమని టీడీపీ చెబుతోంది. అయితే దీనిని వైసీపీ ఖండించింది. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు లేనిపోని అభాండాలు వేస్తున్నారని వైసీపీ వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో తిరుమల లో లడ్డూ ప్రసాదం తయారీ వివాదంపై టీటీడీ, సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేసింది. టీటీడీ ఈవో జె.శ్యామలరావు, సీఎం చంద్రబాబును కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి నివేదిక సమర్పించారు. మరింత సమాచారాన్ని నేడు టీటీడీ అధికారులు సీఎంకు అందజేయనున్నారు.

ఈవో అందించిన నివేదికపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆలయ సంప్రోక్షణ విషయంలో ఆగమ సలహాదారులు, అర్చకుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను సీఎంకు ఈవో వివరించారు. ఈ విషయంలో మరింత విస్తృత సంప్రదింపుల అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.