News

వేద పండితులకు నిరుద్యోగ భృతి

26views

వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు నిరుద్యోగ భృతి కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమీషనర్ కె.ఎల్. సుధారాణి తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ లోగా సమర్పించాలని ఆమె తెలిపారు. రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు నెలకు 3 వేలు రూపాయల నిరుద్యోగ భృతి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ మేరకు నిరుద్యోగ వేద పండితుల నుండి దేవదాయ ధర్మదాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుందని తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులగా ఉన్న అభ్యర్థులు భృతిని పొందేందుకు వేదాధ్యయన సర్టిఫికెట్ల నకళ్లు, ఆధార్ నకలు, ఏ విధమైన ఉద్యగం చేయటం లేదని తెలియజేస్తూ స్వీయ ధ్రువ పత్రంతో దరఖాస్తులను జిల్లా దేవదాయ శాఖ అధికారికి సమర్పించాలని ఆమె తెలిపారు.