ArticlesNews

ఆలయాల్లో రావి, వేపచెట్లు ఎందుకుంటాయి?

22views

సాధారణంగా ఆలయాల్లో రావి, వేపచెట్లు కలిసి కానీ, విడిగా కానీ ఉంటాయి. రావి విష్ణుస్వరూపం, వేప లక్ష్మీస్వరూపం. ఈ జంట వృక్షాలను పూజిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు, దాంపత్య దోషాలు తొలగి సంతానం కలుగుతుందని ‘పద్మపురాణం’ పేర్కొంది. రావికి బోధివృక్షం, అశ్వత్థ వృక్షమనే పేర్లున్నాయి. పురాణేతిహాసాల్లో రావిచెట్టుకు ప్రాధాన్యత ఉంది. ఆ చెట్టు నీడన నిలబడటం, నమస్కరించడం, ఆలింగనం చేసుకోవడం వల్ల శని దోషం తొలగుతుంది. రావికొమ్మలు యజ్ఞ యాగాదుల్లో ఉపయోగిస్తారు. సాధువులు రావి కొమ్మను దండంగా చేసుకుంటారు. రావిచెట్టు గాలి ఆరోగ్యానికి మంచిది. గౌతముడు బోధి వృక్షం కింద విశ్రమించిన తర్వాతే మహాజ్ఞాని అయ్యాడు. శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం కిందనే ప్రాణత్యాగం చేసి అవతారం చాలించాడు. ఇక వేప ఎన్నో ఔషధ గుణాలను కలిగిన దివ్య వృక్షం. అనేక రోగాలను నయం చేస్తుంది. రావి, వేప కలిసి కనుక ఉంటే.. అక్కడ మహా శక్తి ఆవరించి ఉంటుందని పెద్దలు చెబుతారు. వేపచెట్టు ఇంటి ముందు లేదా వెనుక భాగంలో ఉండాలే గానీ కుడి, ఎడమ భాగాల్లో ఉండకూడదు. రావిచెట్టును ఇంటి వద్ద నాటకూడదు.