News

ఇదేం విప్లవం? గిరిజన బాలుడ్ని అతి కిరాతకంగా చంపేసి, విసిరేసిన మావోయిస్టులు

26views

బస్తర్ జిల్లాలో మావోయిస్టులు అతి క్రూరాతి క్రూరంగా వ్యవహరించి, ఓ గిరిజన బాలుడ్ని హత్య చేశారు. స్కూల్ యూనిఫామ్ లో వున్న సమయంలోనే ఆ బాలుడ్ని హత్య చేసి, ఆ బాలుడి మృతదేహాన్ని ఊరి బయట విసిరేశారు. చివరికి గ్రామస్థులు ఆ బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 16 సంవత్సరాల ఈ బాలుడి పేరు సోయం శంకర్. దంతెవాడ జిల్లా పల్నార్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ బాలుడు చదువుతున్నాడు. మావోయిస్టుల ఈ దుశ్చర్యకు భయపడే… ఈ బాలుడ్ని తన కుటుంబీకులు సుక్మా నుంచి బయటికి తీసుకొచ్చి, దంతెవాడలోని పల్నార్ స్కూలులో చేర్పించారు. అయినా సరే నగ్జలైట్లు ఆ బాలుడ్ని విడిచిపెట్టలేదు. సరిగ్గా ఐదారు రోజుల క్రితమే మృతుడి అన్న సోయం సీతారాంను కూడా మావోయిస్టులు హత్య చేశారు. ఆయన వయస్సు 19 ఏళ్లే. ఇలా తన కుటుంబాన్ని నగ్జలైట్లు టార్గెట్ చేయడంతో భయపడిన తల్లిదండ్రులు ఆ గ్రామాన్ని విడిచి, వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.

maoist2

నిజానికి తాము ప్రజల కోసమే అటవీ బాట పట్టామని పదే పదే వల్లెవేసే మావోయిస్టులు.. ఇన్ ఫార్మర్ల పేరుతో అనేక మంది అమాయక గిరిజనులను చంపేశారు. ఈ హత్య కూడా ఇన్ ఫార్మర్ అన్న నెపం పెట్టి… మావోయిస్టులు చంపేసి వుంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే నిజమైతే… 16 సంవత్సరాల ఓ పాఠశాల విద్యార్థి ఇన్ ఫార్మర్ అన్న పాత్రను పోషిస్తాడా? అసలు ఆస్కారం వుందా? అన్నది బుద్ధిజీవులు ఆలోచించారు. ఓ బాలుడు చేసే పనికి కూడా మావోయిస్టులు భయపడి ప్రాణాలు తీసేస్తారా? ఆదివాసీ పిల్లలను చంపడం ద్వారా కమ్యూనిస్టులు తాము భావిస్తున్న విప్లవాన్ని తీసుకొస్తారా? ఇదే కమ్యూనిజం? అని అందరూ ప్రశ్నిస్తున్నారు.