News

ముగిసిన అమర్‌నాథ్ యాత్ర

4views

జమ్ము కాశ్మీర్ లోని సుప్రసిద్ధ అమర్​నాథ్​ యాత్ ముగిసింది. చారీ ముబారక్​ ఈశ్వరుడి చెంతకు చేరుకోవడం వల్ల.. ఆలయ అధికారులు, పండితులు, సాధువులు సమపన్ పూజను నిర్వహించారు.శ్రావణ పూర్ణిమ రోజు నిర్వహించిన సంప్రదాయ పూజా కార్యక్రమాలతో 43 రోజుల సుప్రసిద్ధ అమర్​నాథ్ యాత్ర ముగిసింది. హిమలింగ రూపంలో గుహలో కొలువైన ఈశ్వరుడి చెంతకు చారీ ముబారక్ చేరుకోవడం వల్ల.. ఆలయాధికారులు, పండితులు, సాధువులు ఘనంగా సమపన్ పూజను నిర్వహించారు.

ముగిసిన యాత్ర
ఈ ఏడాది జూన్ 29న ప్రారంభమై 43 రోజుల పాటు సాగిన యాత్ర… ఈరోజు శ్రావణపూర్ణిమ, రక్షాబంధన్ సందర్భంగా సూర్యోదయానికి ముందేఛరీ ముబారక్ అని పిలవబడే పరమశివుని పవిత్ర జాపత్రి అమర్నాథ్ క్షేత్రానికి చేరుకోవడంతో ముగిసింది. సంప్రదాయబద్దంగా యాత్రను ప్రారంభించిన శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు.. ఆనవాయితీగా వస్తున్న ఆచారాల్ని, క్రతవుల్ని పాటిస్తూ రక్షాబంధన్‌ రోజున సంప్రదాయ ముగింపు పూజ కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించింది.ఈ సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 5 లక్షల మందికి పైగా యాత్రికులు క్షేత్రాన్ని సందర్శించి, దర్శనం చేసుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.