News

గిరిజన సాంప్రదాయంలో సుప్రీంకోర్టు జడ్జి వివాహం

43views

అరుకు అందాలు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జెకె మహేశ్వరి కొనియాడారు. జస్టిస్ దంపతులు అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడ మండలంలోని అరకులోయలో పర్యటించారు. రైలులో అరకు చేరుకున్న జస్టిస్ దంపతులను సంయుక్త కలెక్టర్ డా. ఎంజె అభిషేక్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ స్వాగతం పలికారు. జస్టిస్ దంపతులు ట్రైబల్ మ్యూజియం సందర్శించి అక్కడ గిరిజన సంస్కృతి సంప్రదాయాలను తిలకించి మంత్రముగ్దులయ్యారు.

అనంతరం పెదలబుడు పంచాయతీ లోని గిరి గ్రామదర్శిని సందర్శించారు.గిరి గ్రామదర్శిని లో గిరిజన సంప్రదాయం ప్రకారం గిరిజన వస్త్రధారణ గావించిన జస్టిస్ దంపతులు గిరిజన సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. జస్టిస్ దంపతుల వివాహ వేడుకను అట్టహాసంగా నిర్వహించిన నిర్వాహకులను జస్టిస్ దంపతులు అభినందించారు.