News

వక్ఫ్ బోర్డును సంస్కరించాల్సిన అవసరం ఏంటి ?

63views

వక్ఫ్ ఆస్తులపై తరచూ వివాదాలు తలెత్తుతుండటంతో.. వక్ఫ్ బోర్డు హక్కులను నియంత్రించాలన్న డిమాండ్ ఏళ్ల తరబడి నుంచి వినిపిస్తూ ఉంది. సామాన్య ముస్లింలు, పేద ముస్లిం మహిళలు, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళల పిల్లలు, షియాలు, ఘోరాలు వంటి సంఘాలు కూడా చాలా కాలంగా చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి..??
వక్ఫ్ బోర్డు అనేది ఎటువంటి సంస్థ అంటే, అల్లా పేరిట దానంగా ఇచ్చిన సంపదను సంరక్షిస్తూ ఉంటుంది. ముస్లింలు తమ చర లేదా స్థిరాస్తుల్లో దేనినైనా జకాత్‌గా ఇస్తే, ఆ ఆస్తిని వక్ఫ్ అంటారు. ముస్లింలు తమ చర లేదా స్థిరాస్తుల్లో దేనినైనా జకాత్‌గా ఇస్తే, ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తులు అంటారు.ముస్లిం సమాజం యొక్క ఆస్తులు మరియు మత స్థలాల నిర్వహణ మరియు నియంత్రణ కోసం వక్ఫ్ చట్టం రూపొందించబడింది. 1954లో జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని రూపొందించింది. అపరిమిత అధికారాలను కట్టబెట్టారు.

1995 పి.వి. నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా వక్ఫ్ చట్టంలో మార్పులు చేసింది. దీంతో వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు లభించాయి.2013లో, కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాన్ని మరింత సవరించింది మరియు చట్టపరమైన సవాలు లేకుండా ఆస్తిని సంపాదించడానికి వక్ఫ్ బోర్డులకు విస్తృత హక్కులను కల్పించింది. మీకు తెలుసా..2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 123 ఆస్తులను ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు అప్పగించింది. ఈ పరిణామం కారణంగా హిందువులు తమ భూములను కోల్పోయారు.ప్రస్తుతం బోర్డుకు ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారం ఉంది.

{వక్ఫ్ యాక్ట్ 1995 ఆర్టికల్ 40}
వక్ఫ్ చట్టం 1995లోని ఆర్టికల్ 40 ఏం చెబుతుందంటే, ‘సదరు భూమి ఎవరిది అనే విషయాన్ని వక్ఫ్ సర్వేయర్, వక్ఫ్ బోర్డు నిర్ణయిస్తాయి.’ఒకవేళ మీ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే మీరు దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లలేరు.మీరు వక్ఫ్ బోర్డుకు మాత్రమే అప్పీల్ చేయాల్సి ఉంటుంది, వక్ఫ్ బోర్డు నిర్ణయం మీకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ, మీరు కోర్టుకు వెళ్లలేరు.అయితే మీరు వక్ఫ్ ట్రైబ్యునల్‌కు వెళ్లవచ్చు, ఈ ట్రైబ్యునల్‌లో పరిపాలనాపరమైన అధికారులు ఉంటారు. ఇందులో ముస్లిమేతరులు కూడా ఉండవచ్చు.వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ట్రైబ్యునల్ నిర్ణయాన్ని హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో కూడా సవాలు చేయడానికి లేదు.

వక్ఫ్ బోర్డు వద్ద ఏ మేరకు ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం (వక్ఫ్ బోర్డుకు ఎన్ని ఆస్తులున్నాయి?)

 ప్రాథమికంగా వక్ఫ్ బోర్డు దేశవ్యాప్తంగా దాదాపు 52,000 ఆస్తులు కలిగి ఉంది.
 2009 నాటికి 4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న 3 లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి.
 ప్రస్తుతం 8 లక్షల ఎకరాల భూమిలో 8,72,292 కంటే ఎక్కువ రిజిస్టర్డ్ వక్ఫ్ స్థిరాస్తులు ఉన్నాయి.
 చరాస్తులు 16,713 ఉన్నాయి.
 దేశంలో సాయుధ దళాలు మరియు భారతీయ రైల్వేల తర్వాత వక్ఫ్ బోర్డు మూడవ అతిపెద్ద భూ యజమాని.

వక్ఫ్ బోర్డులో అక్రమాలు, సమస్యలు

• న్యాయపరమైన అంశాలు, రాజకీయ నియామకాల కారణంగా వక్ఫ్ బోర్డు అంతర్గతంగా పోరాడుతోంది.

• వక్ఫ్ బోర్డు తరచుగా ప్రభుత్వ భూమి మరియు అక్రమ మత స్థలాల చుట్టూ ఉన్న భూమిని తన ఆస్తిగా పరిగణిస్తుంది, ఇది ఆక్రమణకు దారితీస్తుంది.

• వక్ఫ్ చట్టం, 1995లోని సెక్షన్ 3, ఎటువంటి రుజువు అవసరం లేకుండా కేవలం తన స్వంత అభిప్రాయం ఆధారంగా భూమిపై హక్కు పొందేందుకు బోర్డుని అనుమతిస్తుంది.

వక్ఫ్ సంబంధిత ఫిర్యాదులు

 WAMSI పోర్టల్‌లో 58,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు
 రాష్ట్ర బోర్డుల్లో 12,700 కంటే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి
 ట్రైబ్యునళ్లల్లో 18,400కి పైగా వివాదాలు
 SC/HC లలో 165‌కు మించి కేసులు

వక్ఫ్ బోర్డు ద్వారా ఆస్తుల దుర్వినియోగం
నేడు దేశంలో చాలా వక్ఫ్ బోర్డులు ఎలా ఉన్నాయంటే, అవి ఇప్పటివరకు దేవాలయాల ఆస్తులను మరియు భూములను దుర్వినియోగం చేశాయి.2019లో, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, భారతదేశం అంతటా 16,937 వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆక్రమణకు గురైనట్లు లోక్‌సభకు తెలియజేశారు.వీటిలో పంజాబ్‌లో అత్యధికంగా 5,610 ఆక్రమణలు జరిగాయి.టైమ్స్ నౌ దర్యాప్తులో 500 కోట్ల రూపాయల విలువైన ప్రజా ఆస్తులను గత ప్రభుత్వాలు జమ్మూ కాశ్మీర్‌లోని వక్ఫ్ బోర్డుకు బదిలీ చేసినట్లు వెల్లడైంది.అన్వర్ మనిప్పాడి2012 నివేదిక ప్రకారం కర్ణాటకలో దాదాపు 29 వేల ఎకరాల వక్ఫ్ భూమిని వాణిజ్య అవసరాల కోసం అక్రమంగా బదలాయించారు.గుజరాత్‌లోని మోరా గ్రామంతో సహా పలు ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు వక్ఫ్ చట్టం, 1995ను దుర్వినియోగం చేసిందని ఏక్త-ఇజ్-లక్ష్య సమితి ఆరోపించింది.ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సహకారంతో లక్‌నవూలోని ఒక శివాలయాన్ని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేయడం జరిగింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే, సదరు శివాలయం 1862 నుండి రాష్ట్ర రికార్డుల్లో నమోదు చేయబడగా, షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు 1908లో ఉనికిలోకి వచ్చింది.

కాలానుగుణంగా, వక్ఫ్ బోర్డు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఖండించడం కొన్ని కోర్టు తీర్పులలో చూడవచ్చు.పలు సందర్భాల్లో వక్ఫ్ బోర్డు అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం అనేది పలు కోర్టు తీర్పులలో కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ హై కోర్టు ఇటీవల ఒక కేసుకి సంబంధించి మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. షా ఘజా సమాధి, నాదిర్ షా సమాధి, బీబీ సాహిబ్ మసీదు, బుర్హాన్‌పూర్ కోట ఉన్న మహల్ వక్ఫ్ బోర్డు ఆస్తులని దావా చేసింది. అహ్మదీయ, ఘోరా, అగాఖాన్ వర్గాలకు చెందిన ముస్లింలు వక్ఫ్ బోర్డు ఇష్టారాజ్యంగా, ఆస్తులు లాక్కుంటున్నాయని అనేక ఆరోపణలు చేశారు. అగాఖాన్ షియా ఇమామి కౌన్సిల్‌ ఆధీనంలోని ట్రస్టు ముంబైలో అనేక ఆస్తులను కలిగి ఉంది. వీటి విలువ వేల కోట్లలో ఉంది.

వక్ఫ్ బోర్డులోని వక్ఫ్ ఆస్తులను ఇది భ్రష్టు పట్టించింది. నిజానికి భారత వక్ఫ్ చట్టం పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే, హిందువులకు, క్రైస్తవులకు లేదా సిక్కులకు సమానంగా చట్టం లేదు.ప్రార్థనా స్థలాల చట్టం 1991 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఉన్న మతపరమైన ప్రదేశాలను సంరక్షిస్తుంది. భారతదేశం వంటి సెక్యులర్ దేశంలో, వక్ఫ్ చట్టం ఉనికి సందేహాస్పదంగా ఉంది,ఎందుకంటే ఇది ఒక మత వర్గానికి ప్రత్యేక హక్కులను ఇస్తుంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ వక్ఫ్ బోర్డుకు ఇటువంటి అధికారాలు లేవు, సౌదీ లేదా ఒమన్‌లో కూడా ఇటువంటి చట్టాలు లేవు.నేడు సాధారణ ముస్లింలకు వక్ఫ్ బోర్డులో ఎలాంటి చోటు లేదు. ఇందులో కేవలం శక్తిమంతులే ఉన్నారు.

పలు బడా కుంభకోణాలు, అక్రమ ఆస్తుల వ్యవహారాలు బయటపడ్డా ముస్లిం మేధావులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?

వక్ఫ్ బోర్డులో పెద్ద ఎత్తున సంస్కరణలు చేయాల్సిన సమయం వచ్చేసింది.