News

పురాణాల సందేహాలను నివృత్తి చేసేందుకుప్రత్యేక కేంద్రాలు

57views

పలు శాస్త్రాలు, పురాణాల విషయంలో ప్రజలకు తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు జాతీయ సంస్కృత వర్సిటీలో ప్రత్యేక కేంద్రాలను (పబ్లిక్‌ కన్సల్టెన్సీ సెంటర్స్‌) ఏర్పాటు చేశామని తిరుపతి
సంస్కృత వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి తెలిపారు. కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ అహల్యతో కలసి వర్సిటీ ఆవరణలో సందేహాల నివృత్తి కేంద్రాలను ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ యోగా, జ్యోతిష్యం, ఆగమ, కర్మకాండ, వాస్తు శాస్త్రాలలో ప్రజలకు కలిగే సందేహాలు, సమస్యలను నివృత్తి చేసేందుకు ఈ కేంద్రాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి 6.30గంటల వరకు వర్సిటీలో ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో డీన్‌లు విష్ణుభట్టాచార్యులు, రజనీకాంత్‌ శుక్లా పాల్గొన్నారు.