News

చిట్టేడులో పురాతన శాసనం

76views

తిరుపతి జిల్లా కోట మండలంలోని చిట్టేడు గ్రామంలో చిట్టేటమ్మ ఆలయానికి సంబంధించి మట్టిలో కూరుకుపోయిన 16 శతాబ్దం నాటి శాసనాన్ని శుక్రవారం గ్రామస్తులు వెలికితీశారు. గ్రామస్తుల వినతి మేరకు గూడూరు ఎస్‌కేఆర్‌ కళాశాల చరిత్ర అధ్యాపకులు గోవిందు సురేంద్ర, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో సీనియర్‌ ఫెలోగా పనిచేస్తున్న మమత శాసనాన్ని పరిశీలించారు. 16వ శతాబ్దానికి చెందిన శాసనంగా గుర్తించారు. పాలెగాళ్ల వంశస్తులు వేయించిన శాసనంగా తెలుస్తోందన్నారు. క్రీ.శ 1611వ సంవత్సరంలో చిట్టేడు గ్రామ వివరాలు, ఆలయ నిర్మాణం, కోనేరు మండపానికి సంబంధించిన వివరాలు శాసనంలో పొందుపరిచి ఉన్నాయన్నారు. ఈ శాసనం సంస్కృత భాషలో ప్రాచీన తెలుగు లిపిలో మొత్తం 16 పంక్తుల్లో శంఖుచక్ర, సూర్యచంద్ర నామాల గుర్తులతో ఉందని మమత తెలిపారు.