News

సీఏఏ పౌరసత్వానికి అవసరమైన పత్రాలివే : స్పష్టత ఇచ్చిన కేంద్రం

42views

అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో వేధింపులు ఎదుర్కొంటున్న మైనార్టీలకు భారత పౌరసత్వం మంజూరుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద జారీ చేసిన నిబంధనల పరిధిని కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. దరఖాస్తుదారుల తల్లిదండ్రులు, తాతలు లేదా ముత్తాతల్లో ఎవరో ఒకరు ఆ మూడు దేశాల్లో పౌరులుగా ఉన్నారని లేదా గతంలో ఉండేవారని ధ్రువీకరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా భారత్‌లోని ఏదైనా క్వాసీ జుడీషియల్‌ సంస్థ జారీ చేసే ఎలాంటి పత్రమైనా చెల్లుబాటు అవుతుందని స్పష్టంచేసింది. సీఏఏలోని ఒక నిర్దిష్ట నిబంధన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అనేక మంది దరఖాస్తుదారులు పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తాజా స్పష్టత ఇచ్చింది.