News

స్వాతంత్ర దినోత్సవం నాడు ఇస్రో ప్రయోగం

34views

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భూ పరిశీలన ఉపగ్రహాన్ని గ‌గ‌న‌త‌లంలోని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌, SSLV స‌హాయంతో ఆగస్టు 15వ తేదీ ఉదయం 9 గంట‌ల 17 నిమిషాల‌కు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి ఉపగ్రహ ప్ర‌యోగం జ‌ర‌గ‌నుంది. ఇస్రో అభివృద్ధి చేసిన ఈ SSLV, 500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 500 కిలోమీటర్ల కక్ష్యలోకి తీసుకెళ్ళే సామ‌ర్థ్యం క‌లిగి ఉంది. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయబ‌డే ఈ వాహ‌క నౌక స‌హాయంతో బహుళ సూక్ష్మ ఉపగ్రహాలను ప్ర‌యోగించ‌వ‌చ్చు.