News

ఇస్లామిక్‌వాదుల ఒత్తిడి వల్లే….

63views

షేక్‌ హసీనా బంగ్లాదేశ్‌ను వీడడంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బంగ్లాదేశ్‌ నుంచి తనని తరమేసిన ఇస్లామిక్‌వాదుల ఒత్తిడి వల్లే నేడు షేక్‌ హసీనా దేశాన్ని వీడారంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఇస్లామిక్‌వాదులు, అవినీతి, అక్రమాలను ప్రోత్సహించడం వల్లే హసీనాకు ఈ పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో మహిళల సమానత్వంపై తస్లీమా రాసిన లజ్జ అనే నవల 1990ల్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఇస్లామికవాదుల ఒత్తిడుల నేపథ్యంలో తస్లిమా దేశ బహిష్కరణకు గురయ్యారు. బంగ్లాలో తాజా పరిణామాలపై తస్లీమా స్పందిస్తూ.. ‘‘హసీనా ప్రస్తుత పరిస్థితికి ఆమే బాధ్యురాలు. ఇస్లామిక్‌వాదులను, అవినీతి, అక్రమాలను ప్రోత్సహించింది ఆమే. బంగ్లాదేశ్‌ పాకిస్థాన్‌లా మారకూడదు. సైనిక పాలన ఉండకూడదు. రాజకీయ పార్టీలు దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని తీసుకురావాలి’’ అని పోస్ట్‌ చేశారు.