News

బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణకాండ… చర్యలకు వీహెచ్‌పీ డిమాండ్

44views

బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) భారత ప్రభుత్వాన్ని కోరింది. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ విచిత్రమైన అనిశ్చితి, హింస, అరాచకంలో చిక్కుకుందని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా అణగారిన వర్గాలకు సంప్రదాయబద్ధంగా సాయం చేస్తున్న భారత్ ఈ పరిస్థితిలో కళ్లుమూసుకోలేమని ఆయన స్పష్టం చేశారు.

హసీనా ప్రభుత్వం రాజీనామా చేసి ఆమె దేశం విడిచిపెట్టిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని, ఈ సంక్షోభ సమయంలో, బంగ్లాదేశ్‌లోని మొత్తం సమాజానికి మిత్రుడిగా భారత్ దృఢంగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో హిందువులు, సిక్కులు, ఇతర మైనారిటీల మతపరమైన స్థలాలు, వ్యాపార సంస్థలు, ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయని అలోక్ కుమార్ తెలిపారు.

నిన్న రాత్రి వరకు, ఒక్క పంచగఢ్ జిల్లాలోనే 22 ఇళ్లు, జెనైదాలో 20 ఇళ్లు, జెస్సోర్‌లో 22 దుకాణాలు ఛాందసవాదుల లక్ష్యంగా మారాయని, అనేక జిల్లాల్లో శ్మశాన వాటికలు కూడా ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు. దేవాలయాలు, గురుద్వారాలను కూడా ధ్వంసం చేయడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో వారి హింస, భీభత్సానికి గురికాని జిల్లా ఏదీ లేదని చెప్పారు.

బంగ్లాదేశ్‌లో ఒకప్పుడు 32 శాతంగా ఉన్న హిందువులు ఇప్పుడు 8 శాతం కంటే తక్కువగా ఉన్నారని, వారు కూడా నిరంతర జిహాదీ పీడనకు గురవుతున్నారని అలోక్ కుమార్ గుర్తు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, మహిళలు, పిల్లలు, వారి విశ్వాసం, విశ్వాసాల కేంద్రాలు, దేవాలయాలు, గురుద్వారాలు వంటి వాటికి కూడా భద్రత లేదని వీహెచ్‌పీ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడ అణగారిన మైనార్టీల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితిలో, బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత, మానవ హక్కుల పరిరక్షణ కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం ప్రపంచ సమాజం బాధ్యత అని ఆయన చెప్పారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని, 4,096-కిలోమీటర్ల పొడవు (2,545 మైళ్ళు)గా గల ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు గుండా భారతీయ భూభాగంలోకి చొరబాటుకు పెద్ద ప్రయత్నం చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

ఈ విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందువల్ల, సరిహద్దుల్లో 24×7 పటిష్టమైన నిఘా ఉంచడం, ఎలాంటి చొరబాట్లను అనుమతించకుండా మన భద్రతా బలగాలు అవసరమని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్‌లో వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యం, లౌకిక ప్రభుత్వం పునరుద్ధరణ జరగాలని అలోక్ కుమార్ ఆకాంక్షించారు. అక్కడి సమాజం మానవ హక్కులను పొందాలని, బంగ్లాదేశ్ నిరంతర ఆర్థిక పురోగతిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని అభిలాషను వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్‌ సమాజం, ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు మద్దతునిస్తూనే ఉంటాయని ఆయన తెలిపారు.