News

ఏడు జ్యోతిర్లింగాల ప్రముఖ పుణ్య క్షేత్రాల యాత్ర

36views

దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ… భారతీయ సంస్కృతిని తెలియజేసేలా రైల్వేశాఖ మరో “భారత్ గౌరవ్ పర్యాటక రైలు”ను ప్రారంభించింది. ఈ రైలులో ప్రయాణించి ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు ఉజ్జయిని, ద్వారకా, సోమనాథ్, పూణే, నాసిక్ ఔరంగాబాద్ వంటి ఏడు జ్యోతిర్లింగాల, ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చని IRCTC జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కిశోర్ సత్య మాట్లాడుతూ…. విజయవాడలో ప్రారంభమైన ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ మీదగా ఉజ్జయిని చేరుకుంటుందన్నారు. ఈ యాత్ర 12 రోజుల వరకు కొనసాగుతుందని, ప్రయాణికులకు ప్రయాణ బీమా సౌకర్యం కూడా ఉంటుందని తెలియజేశారు. ఐఆర్సీటీసీ టూరిజం బడ్జెట్ ధరలో భారత్ గౌరవ్ పర్యాటక రైలులో తక్కువ ధరకే ఏడు జ్యోతిర్లింగాల ప్రముఖ పుణ్య క్షేత్రాల యాత్ర చేసి రావచ్చన్నారు.