News

బంగ్లాదేశ్ లో భయం గుప్పిట్లో 40 వేల మంది తెలుగు సంతతి ప్రజలు

59views

బంగ్లాదేశ్‌లో తెలుగు సంతతి ప్రజలు ఉన్నారనే సంగతి మీకు తెలుసా ? బంగ్లా పౌరుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ మూలాలన్న వారు 40 వేల మంది వరకు ఉన్నారు. దేశంలోని అల్పసంఖ్యాకవర్గాల్లోనూ అత్యంత స్వల్ప జనాభా కలిగిన వర్గంగా ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. తెలుగులో మాట్లాడటమే కాకుండా.. తెలుగు పండుగలను చేసుకుంటూ, సంస్కృతిని కాపాడుకుంటుంన్నారు. అంతేనా, ఓ తెలుగు పాఠశాలను కూడా నిర్వహించుకుంటున్నారు. బంగ్లాదేశ్‌ పౌరులైన ఈ తెలుగు సంతతి ప్రజలు ప్రస్తుతం భయాందోళనలో ఉన్నారు.

దేశంలో శరవేగంగా మారుతున్న పరిస్థితులతో ఏ క్షణం ఏం జరుగుతుందని భయం భయంగా గడుపుతున్నారు. భారతదేశంలో బ్రిటీష్‌ పాలన సమయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతాలకు చెందిన చాలా మంది ఢాకా వచ్చారు. వీళ్లలో కాగా ఢాకాలో పారిశుధ్య పనులు, రైల్వే స్టేషన్లు, తేయాకు తోటల్లో కార్మికులగా పని చేసేవారు. క్రమంగా వీరి కుటుంబాలు బంగ్లాదేశ్‌లో స్థిరపడిపోయినా నేటి తరం వారు తెలుగు మూలాలను మరచిపోలేదు. ప్రస్తుతం ఢాకా శివారులోని ధల్పూర్‌, తికతులీ, గోపిబాగ్‌ మరియు కళ్యాణ్‌ పూర్‌ ప్రాంతాల్లో వీళ్లంతా నివసిస్తున్నారు. వీళ్లలో చాలా మంది నేటికి పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. మరుగుదొడ్లు శుభ్రం చేసే మెహెతర్‌ వృత్తిలో తెలుగు సంతతి ప్రజలే అధికంగా ఉన్నారు. అల్పసంఖ్యాక వర్గంగా బంగ్లాలో ఉన్న వీరంతా ఒకప్పుడు తమ హక్కుల కోసం ఢాకాలో పోరాటం చేశారు. కానీ నేడు దేశంలో నెలకొన్న పరిస్థితులతో ఆత్మరక్షణలో పడ్డారు.