News

చరిత్రకు ఆనవాళ్లు.. పురాతన దేవాలయాలు

44views

తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్‌లో పురాతన ఆలయాలు చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయని పురావస్తుశాఖ ప్రొఫెసర్‌ సురేంద్ర తెలిపారు. మండలంలోని కొత్తపట్నం, చిట్టేడు, గూడలిలో శిథిలావస్థకు చేరిన ఆలయాలను మంగళవారం ఆయన సందర్శించారు. తీర ప్రాంతంలోని కొత్తపట్నంలో రాజుల కాలం నాటి కట్టడాలు మనకు కనిపిస్తున్నాయని, ఇక్కడ విష్ణు దేవాలయంతో పాటు శివాలయాన్ని చోళరాజులు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోందని చెప్పారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన కారణంగా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. చిట్టేడులో పురాతన కోనేరుకు ఎంతో చరిత్ర ఉందన్నారు. అంతరించి పోతున్న అమ్మవారి కోనేరుకు సంబంధించి శాసనాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలియజేశారన్నారు.