News

మొన్న రాజస్థాన్, నేడు యూపీలో.. ఆరెస్సెస్ శాఖలపై ముస్లిం ఛాందసుల దాడులు

69views

శాంతియుతంగా తమ శాఖ నడుపుకుంటున్న స్వయంసేవకులపై ముస్లిం ఛాందసులు యూపీలో రాళ్లు రువ్వారు. లక్నోలోని చిహ్నట్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో ఈ ఘాతుకం జరిగింది. ముస్లింలు రాళ్లు రువ్వడంతో శాఖ కార్యవాహ యువరాజ్‌ ప్రజాపతి వెంటనే సాకీబ్‌ అనే ముస్లింతో పాటు మరో 10 మంది వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఈ నెల 27న సాయంత్రం 6 గంటలకు శాఖ చేస్తున్న వారిపై ముస్లింలు రాళ్లు, ఇటుకులను రువ్వారు. ఇదంతా ముందస్తు ప్లాన్‌ ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. కేవలం రాళ్లు, ఇటుకలతో దాడి చేయడమే కాకుండా.. అసలు ఈ ప్రాంతంలో శాఖ నడపకూడదంటే స్వయంసేవకులను బెదిరించారని కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది.
మరోవైపు చిహ్నట్‌ పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం 191(2), 352, 232 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. మరోవైపు యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్‌ మౌర్య కూడా ఈ ఘటనపై సీరియస్‌ అయ్యారు. శాఖపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరుపుతామని, రాళ్ల దాడికి దిగిన ఇస్లామిక్‌ ఛాందసవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

రాజస్థాన్‌లోనూ ఇదే తరహా ఘటన…
గత నెల 23 వ తేదీన అచ్చు ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లోనూ జరిగింది. రాజస్థాన్‌లోని భిల్వారాలో డజన్ల కొద్దీ ఇస్లామిక్‌ ఛాందసవాదులు రెచ్చిపోయి స్వయంసేవకులపై దాడికి దిగారు. మహాత్మా గాంధీ హాస్పిటల్‌ కాంప్లెక్స్‌లోని పార్క్‌లో శాఖా జరుగుతుండగా… ఇస్లామిక్‌ వాదులు దాడికి దిగారు. ఈ విషయాన్ని శాఖ కార్యవాహ విజయ్‌ సోనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే చేరుకొని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముస్లింల దాడిలో శాఖలోని ఓ బాల స్వయంసేవక్‌ కాగా… మరో స్వయంసేవక్‌ ప్రౌఢ స్వయంసేవక్‌. వారిద్దరికీ మెడకు తీవ్రంగా గాయాలయ్యాయని, రెండు రోజుల పాటు ఆస్పత్రి పాలయ్యారని శాఖ కార్యవాహ ప్రకటించారు. అయితే.. ఇలాంటి దాడులు కొత్తేమీ కాదని, గతంలోనూ తాము ఎదుర్కొన్నామని పేర్కొన్నారు.

ఇలాంటి హింసాత్మక దాడులు కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా ప్రదేశాలలో శాంతియుతంగా తమ శాఖ చేసుకుంటున్న స్వయంసేవకులే లక్ష్యంగా చాలా మంది దాడులకు దిగారు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టించారు. చాలా మంది స్వయంసేవకులు తీవ్రంగా గాయపడ్డారు కూడా. అయినా సరే.. ఎక్కడా తమ ధైర్యాన్ని కోల్పోకుండా.. హిందూ సమాజ సంఘటనం కోసం అత్యంత దృఢ సంకల్పంతో తమ కార్యాన్ని స్వయంసేవకులు చేసుకుంటూనే ముందుకి సాగుతున్నారు.