News

రుద్రాక్షధారణ ఎందుకు?

46views

విభూతి, రుద్రాక్ష ధరించ కుండా శివపూజ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని లింగపురాణం చెబుతోంది. త్రిపురాసురులను సంహరించే సమయంలో పరమేశ్వరుడి కంటి నుంచి జాలువారిన దయా బిందువులే రుద్రాక్షలుగా మారాయని పురాణాలు పేర్కొంటున్నాయి. రుద్రాక్షను ధరిస్తే సమస్త పాపాలు పోతాయంటుంది యోగసారం. రుద్రాక్ష దాని ముఖాలను బట్టి పద్నాలుగు రకాలుగా ఉంటుంది. తల, చేతులు, కంఠానికి రుద్రాక్షలు ధరిస్తారు. రుద్రాక్ష ధారణలో ఆరోగ్య ప్రయోజనాలూ దాగున్నాయి. ఇది అమలత్వాన్ని, ఉష్ణత్వాన్ని కలిగించి క్రిములను పోగొడుతుందని, రుద్రాక్షను ధరిస్తే నీచభావాలు దగ్గరకు రావని ఆయుర్వేదం చెబుతోంది. 25గాని, 27గాని, 108గాని రుద్రాక్షలున్న మాలను మెడలో ధరిస్తే మేలన్నది పెద్దల మాట.