News

నలుగురు విద్యార్థులు షరియా తెచ్చారు

325views

స్పెయిన్ ఒకప్పుడు క్రైస్తవ దేశం. తరువాత ముస్లిం దేశమైంది. మళ్లీ ఒంటిమీద కాస్త స్పృహ ఉన్న క్రైస్తవులు ముస్లింలను తరిమి క్రైస్తవ దేశంగా మార్చుకున్నారు. ముస్లిం వ్యవహారాల ఎక్కడైనా ఒకటే. ఎడారిలో షేక్, ఒంటె కథ అనుభవమే. ఆ వర్గం వారు ఇద్దరే ఉంటే, సెక్యులరిజం గురించి ఊదరగొడతారు. నలుగురు అయిన తరువాత షరియా అమలు చేయాల్సిందే అంటారు. ఇప్పుడు
జర్మనీలో జరిగింది ఇదే. జర్మనీలో దుసాల్డోర్ఫ్ దగ్గరి నెయూస్ అనే చోట ఉన్న ఒక పాఠశాలలో జరిగిన ఉదంతం నిజంగా మొత్తం ప్రపంచం గమనించ వలసిందే. అది జర్మనీని కుదిపేసింది. కేవలం నలుగురు ముస్లిం విద్యార్థులు మిగిలిన విద్యార్థులనే కాదు, ఉపాధ్యాయులను కూడా ఇస్లామిక్ సూత్రాలు తుచ తప్పకుండా అనుసరించే విధంగా చేయగలిగారు. ఈ నలుగురిని వ్యతిరేకిస్తే ఎలాంటి పరిణా మాలు ఎదురవుతాయోనని మాత్రమే చాలామంది తలొగ్గి ఆ నలుగురి మాట ఔదలదాల్చారు. కొందరు అమాయక విద్యార్థులు మతమే మారిపోయారు. ఒక సంవత్సరం పాటు ఆ పాఠశాల వరకు షరియాను అమలు చేయడానికి చాలా ప్రయత్నం చేశారు.

విద్యార్థులంతా ప్రార్ధన చేయవలసిన సమయాన్ని నిర్ణయించారు. అందుకోసం స్థలం కావాలని కోరారు. అంతేనా, బాలికలు, వనితలు విద్యార్థులతో పాటు పురుషులతో నేరుగా మాట్లాడడానికి వీల్లేదని ప్రకటించారు. తరగతి గదులలో అబ్బాయిలు ముందు కూర్చోవాలన్నారు. బాలికల స్థానం వెనకేనని చూపించారు. మొత్తానికి ఇదంతా పోలీసుల దృష్టికి వెళ్లింది. జర్మనీ పోలీసులు కూడా తెలుగు సినిమా పోలీసుల మాదిరిగానే ఆఖరున ఈలలు వేస్తూ వచ్చారు. ఈ మతోన్మాదం మీద దర్యాప్తు ప్రారంభించారు. నార్త్న్ వెస్టఫేలియా మంత్రి అక్కడి విద్యార్థులందరి తల్లిదండ్రులను పిలిపించాడు. దేశంలో జరిగిపోతున్న ఇస్లామీకరణ పట్ల కాస్త మెలకువగా ఉండాలని ఉపాధ్యాయులకి, ఇతర యువతరానికి ఆయన పిలుపునిచ్చాడు. జర్మనీలో ఇస్లాం మతోన్మాదం ఎంత స్థాయికి చేరకుంటే, దాని ప్రభావం చూపకపోతే నలుగురు విద్యార్థులు ఇంతకు తెగించగలరు?