News

భస్మహారతికి పోటెత్తిన భక్త జనం

48views

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోగల మహాకాళేశ్వరుని ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణమాసం(ఉత్తరాదిన)లోని రెండవ సోమవారం సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుని దర్శనం కోసం తరలివస్తున్నారు.

ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించారు. శ్రావణమాసంలో మహాకాళేశ్వరుని దర్శనం కోసం విదేశాల నుంచి కూడా భక్తులు ఉజ్జయినికి తరలివస్తుంటారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసం రాకకు ముందే ఆలయ ప్రాంగణం అంతటా రంగులు వేశారు. ఈ మాసంలో ఆలయంలో నిర్వహించే మహాశివుని ఊరేగింపు వైభవంగా జరుగుతుంటుంది. దీనిని చూసేందుకు భక్తజనం అమితమైన ఆసక్తి చూపిస్తారు.