News

అయోధ్య మసీదు నిర్మిస్తున్న స్థలం నా కుటుంబానిదే… ఆరోపించిన ఢిల్లీ మహిళ

46views

ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో జన్మ భూమి-బాబ్రీ మసీదు కేసు అనంతరం మసీదు నిర్మాణంకోసం సుప్రీంకోర్టు కేటాయించిన భూమిలో ఐదు ఎకరాలు తన కుటుంబాని చెందినదేనంటూ తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆరోపణలు చేసింది. ఇందుకోసం తాను సర్వోన్నత న్యాయస్థా నాన్ని ఆశ్రయిస్తానని రాణి పంజాబీ పీటీఐకు తెలి పింది. ఈ ఆరోపణలపై స్పందించిన ఇండో- ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధిపతి జపుర్ ఫరూఖీ ఆమె ఆరోపణలను ఖండించారు. రాణి పంజాబీ వాదనలను 2021లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఈ అక్టోబరులో మసీదు నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు.

స్వాతంత్రానికి ముందు తన తండ్రి జ్ఞాన్ చంద్ పంజాబీ పాకిస్తాన్లోని పంజాబ్లో ఉండేవారని, అనంతరం పాక్ను వదిలి ఇప్పటి ఫైజాబాద్ లో స్థిరపడ్డారని రాణి పంజాబీ పీటీఐతో పేర్కొంది. 1983 వరకు మసీదుకు ఇచ్చిన 5 ఎకరాల భూమితో కలిపి మొత్తం 28.35 ఎకరాల భూమిని తన తండ్రి సాగు చేసేవారని తెలిపింది. అనంతరం ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో తాము ఢిల్లీకి వెళ్లవలసి వచ్చి నట్లు చెప్పింది. ఈ క్రమంలోనే కొంతమంది తమ భూమిని ఆక్రమించుకున్నారని వాపోయింది. తాను మసీదు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ఐదు ఎకరాల భూమి తమదేనని ప్రభుత్వం గుర్తిస్తే చాలని తెలిపింది. భూమి యాజమాన్య పత్రాలన్నీ ఇప్పుడు ట్రస్ట్లోనే ఉన్నాయని వాటిని తిరిగి పొందేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పేర్కొంది.