News

శివుడికి నైవేద్యంగా ఔషధాలు

77views

ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషదాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం జనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. వర్సిటీకి చెందిన ఆయుర్వేద అధ్యాపక బృందం పలు రకాల రోగాల నివారణ కోసం ఔషదాలను తయారుచేస్తుంది. ఔషదాల తయారీ తర్వాత వాటిని శివుడికి వైవేద్యంగా సమర్శిస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని కొన్నేళ్ల నుంచి పాటిస్తున్నారు. “ఆయుర్వేద శాఖ పరిధిలో ఏ ఔషధం తయారుచేసినా ముందుగా శివుడికి సమర్పిస్తాం రోగాలను తొలగించే దేవుడు రాసేశ్వర్ మహాదేవ్ అని నమ్ముతాం దేశులో కొవిడ్ విజృంభణ సమయంలోనూ పరిశోధకులు తయారుచేసిన కషాయాలను దేవుడి వద్ద పెట్టాం. ప్రజలకు జీవితాన్ని అందించిన భోలేనాటి ఏ ఔషదమైనా మొదట అంకితం చేస్తాం” అని వర్సిటీ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ ఆనంద్ చౌదరి తెలిపారు.