News

కళావిహీనంగా చారిత్రక గుత్తి కోట

42views

అనంతపురం జిల్లాలోని చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ కోట ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. కట్టడాలు, కోనేరు, ప్రాకారాలు, బురుజులు, రక్షణ కోసం నిర్మించిన పొడవాటి గోడ, గుర్రపు, గజశాలలకు వేటికవే ప్రత్యేకం. నిర్వహణపై అలసత్వం కారణంగా రక్షణ గోడలు శిదిలమవుతున్నాయి. ప్రాకారాలు, బురుజులు నేడు కళావిహీనంగా మారిపోయాయి. పర్యాటకులు సైతం అంతంతమాత్రంగానే వస్తున్నారు. కోటపై భాగానికి చేరుకోవాలంటే 3 గంటల సమయం పడుతోంది. ఆసక్తితో పర్యాటకులు ఎక్కే ప్రయత్నం చేసినా వెళ్లే దారిలో మౌలిక వసతులు లేక నిట్టూర్చుతున్నారు. గతంలో రోప్వే వేసే ప్రణాళికలు వేసినా అవి కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో చారిత్రక, ప్రాచీన ప్రాశస్త్యం ఉన్న కట్టడాలను, ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే దిశగా కలెక్టర్ వినోద్ కుమార్ సంబందిత శాఖలకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. టూరిస్ట్ హబ్ మార్చే దిశగా వేసే అడుగుల్లో భాగంగా గుత్తికోటను అభివృద్ధి చేస్తే.. పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది.